ఎమ్మెల్సీ కవిత ఆ బుక్‌ను అడగడానికి కారణం ఏంటి? ఆ పుస్తకాన్నే ఎందుకు అడిగారు?

by Anjali |   ( Updated:2024-04-03 14:47:53.0  )
ఎమ్మెల్సీ కవిత ఆ బుక్‌ను అడగడానికి కారణం ఏంటి? ఆ పుస్తకాన్నే ఎందుకు అడిగారు?
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇటీవల ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమె తనకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సీబీఐ కోర్టును కోరిన విషయం తెలిసిందే. ఒంటిపై ఉన్న నగలు, టాబ్లెట్స్, చెప్పులు, బెడ్ అండ్ బెడ్ షీట్లు వంటి వసతులను ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కల్పించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.

కానీ జైలు అధికారులు పట్టించుకోకపోవడంతో కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. కోర్టులో కంప్లైంట్ ఇచ్చింది. ఈ అంశాన్ని పరిశీలించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. కవితను రాజకీయ నిందితురాలిగా గుర్తించి ఆమెకు వసతులు కల్పిచాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆమె చదువుకునేందుకు బుక్స్ కూడా కావాలని కోరింది. అయితే కవిత అడిగిన పుస్తకం గురించి విని.. బీజేపీ నేతలు, లాయర్లు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. మరీ కవితక్క అడిగిన ఆ పుస్తకం ఏంటంటే? బీజేపీ సిద్ధాంతాలకు పునాది అయిన ఆర్ఎస్ఎస్ రచించిన ‘21వ శతాబ్ధానికి ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్స్’ పుస్తకం.

ఇందులో స్వయం సేవక్‌లు ప్రభుత్వంలో ఉన్నత స్థానాలకు ఎదగడంతో పాటు సంఘ్ ప్రధాన ఆలోచనలైన హిందూ రాష్ట్ర ఏర్పాటు, ఏకాత్మత, సామాజిక, రాజకీయ అంశాలు, మారుతున్న కుటుంబ స్వభావం, విభిన్న లైంగిక ధోరణులు, సామాజిక సమస్యలపై ఆర్‌ఎస్ఎస్ ఏమనుకుంటుంది వంటి పలు వివాదస్పద అంశాలు ఉంటాయి. ఈ అంశాలను ఆర్ఎస్ఎస్ నాయకుడు సునీల్ అంబేకర్ ఈ పుస్తకంలో విశ్లేషించారు. కవిత ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలనుకుంటోంది? అని హాట్ టాపిక్‌గా మారింది.

ఈ పుస్తకంతో పాటు కవిత.. జయ ఘోష, నరసింహ శతకం, గజేంద్ర మోక్షం పుస్తకాలు కావాలని కోరింది. 365 సుడుకోస్, మురకామి-నార్వేజియన్ వుడ్, లివింగ్ ఇన్ ది లైట్ ది కుకింగ్ ఆఫ్ బుక్స్, ది డైరీ ఆఫ్ ఏ యంగ్ గర్ల్, పేపర్ క్లబ్ నోట్‌బుక్ పుస్తకాలను కూడా కావాలని అడిగింది. ప్రతి రోజూ వార్త పత్రికలను కూడా తనకు అందజేయాలని కోరింది.

Advertisement

Next Story