Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..

by Shiva |
Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..
X

దిశ, వెబ్‌‌డెస్క్: భారతీయ సినిమాకు విశిష్ట సేవలందించిన వారికి ఇచ్చే దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు (Dada Saheb Phalke Award) ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)ని వరించింది. ఈ మేరకు ఆయన అక్టోబర్ 8న పురస్కారాన్ని అందుకోబోతున్నారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Union Minister Ashwini Vaishnav) తన ‘X’ ఖాతాలో పోస్టు చేశారు. కాగా, మృణాల్ సేన్ (Mrunal Sen) దర్శకత్వం వహించిన ఆర్ట్ హౌస్ డ్రామా మృగయా (Art house drama Mrigaya) (1976) మూవీతో మిథున్ చక్రవర్తి తన నటనా రంగ ప్రవేశం చేశారు. అదే చిత్రంలో అద్భత నటనతో ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు (National Film Award)ను గెలుచుకున్నారు. 1982 వచ్చిన డిస్కో డ్యాన్సర్‌ (Disco Dancer) మూవీ కుర్రకారును ఓ ఊపు ఊపేసింది.

ఇండియాలోనే కాకుండా సోవియట్ యూనియన్‌ (Soviet Union)లోనూ విడుదలైన డిస్కో డ్యాన్సర్ బాక్సాఫీస్ అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. దీంతో వరల్డ్ వైడ్‌గా ఆయన సపరేట్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. హిందీ, బెంగాలి, భోజ్‌పురి, తమిళ, ఒరియా, కన్నడ, తెలుగు, పంజాబీ భాషల్లో కలిపి మొత్తం 350 పైగా సినిమాల్లో మిథున్ చక్రవర్తి నటించారు. 1989లో ఏకంగా 19 సినిమాల విడుదలతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయన స్థానం సంపాదించారు. ఇప్పటి వరకు ఆ రికార్డు చెక్కుచెదరకుండా అలానే ఉండటం విశేషం. ఫిబ్రవరి 7, 2014న పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) తరఫున రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అనంతరం డిసెంబర్ 26, 2016న తన పదవికి రాజీనామా చేసి ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీ (BJP)లో చేరారు. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఓ వైపు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే కొన్ని మూవీలను నిర్మించారు. ఇదే ఏడాది జనవరిలో మిథున్ దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌ను అందుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed