మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ డీటెల్స్.. రవి తేజ ముందు పెద్ద టార్గెటే ఉందిగా..

by Prasanna |
మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ డీటెల్స్.. రవి తేజ ముందు పెద్ద టార్గెటే ఉందిగా..
X

దిశ, సినిమా : మాస్ మహారాజా రవితేజ వరుస ఫ్లాప్స్ తర్వాత వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇది పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా తెరకెక్కింది. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడీ చేయనుంది. ఇప్పటికే రిలీజ్ అయినా మూవీ టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయితే, ఈ సారి చిత్ర టీం కొత్త నిర్ణయం తీసుకుని ఫలితాలతో సంబంధం లేకుండా ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు చెబుతున్నాయి. మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ రైట్స్ సీడెడ్ ఆంధ్రా, నైజాం, ఆంధ్రా ఏరియాల్లో రికార్డు ధరకు వెళ్లిందని అంటున్నారు. నైజాం, ఆంధ్రా ఏరియాల్లో 23 కోట్లకు, సీడెడ్ ఆంధ్రాలో రూ.4 కోట్లు, ఓవ‌ర్‌సీస్‌లో రూ. 2 కోట్లు , క‌ర్నాట‌క‌, రాయ‌చూర్‌ మిగిలిన ప్రాంతాల్లో క‌లిపి రూ.2 కోట్లకు ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం.

ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 27 కోట్లు, వరల్డ్ వైడ్ గా రూ. 31 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా రూ. 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రవితేజ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story