Meera Jasmine : బర్త్ డే స్పెషల్.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన మీరా జాస్మిన్

by Prasanna |
Meera Jasmine : బర్త్ డే స్పెషల్.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన మీరా జాస్మిన్
X

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికి సుపరిచితమే. దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో మూవీస్ విషయం పక్కన పెడితే ప్రతి ఒక సెలబ్రెటి ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. మూవీ ఛాన్స్ కోసం హాట్ హాట్ పిక్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ జాబితాలో మీరా జాస్మిన్ కూడా చేరింది. ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా కొన్ని హాట్ ఫొటోస్ షేర్ చేసింది. దీంతోపాటుగా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తన మూవీకి సంబంధించిన గుడ్‌న్యూస్ చెప్పింది. తెలుగు, తమిళ భాషల్లో 'విమానం' పేరుతో మూవీ రూపొందుతుంది. ఇందులో మీరా కీలక పాత్ర పోషించనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్.

Advertisement

Next Story