- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Razakar సినిమాపై మంత్రి KTR మరోసారి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: పొలిటికల్ కాంట్రావర్సీగా మారిన రజాకార్ సినిమాపై మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రజాకార్ సినిమాను ఓ బీజేపీ నేత తీశాడని.. సెప్టెంబర్ 17 గాయాలు మానుతుంటే.. మళ్లీ చిల్లర సినిమాలు తీస్తున్నారని మండిపడ్డారు. మానిన గాయాలను మళ్లీ రెచ్చగొట్టాలని బీజేపీ చూస్తోందని ఫైర్ అయ్యారు. కులం, మతం పేరుతో విభజించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. కశ్మీర్ ఫైల్స్ ఓ వైపు.. రజాకార్ సినిమా మరోవైపని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై కేటీఆర్ ఇదివరకే రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. తెలంగాణలో ఇటువంటి కుట్రలు నడవనని అన్నారు. వివాదాలకు కేరాఫ్‌గా మారిన రజాకార్ సినిమాపై పోలీసులకు, సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని అన్నారు. రజాకార్ల దురాగతాలను చూపించడం బీఆర్ఎస్‌కు ఇష్టం లేదని అన్నారు.
ఇవి కూడా చదవండి : పొలిటికల్ కాంట్రావర్సీగా ‘రజాకార్’ మూవీ.. సినిమాపై కీలక వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్