ప్రేమ కోసం ఏరులై పారిన నెత్తురు.. ఆసక్తికరంగా 'Micheal' ట్రైలర్!

by Hajipasha |   ( Updated:2023-01-23 12:36:32.0  )
ప్రేమ కోసం ఏరులై పారిన నెత్తురు.. ఆసక్తికరంగా Micheal ట్రైలర్!
X

దిశ, సినిమా: యంగ్ హీరో సందీప్ కిషన్, రంజిత్ జేయకోడి కలయికలో వస్తున్న లేటెస్ట్ మూవీ 'మైఖేల్'. పాన్ ఇండియా లెవల్‌లో ఫిబ్రవరి 3న విడుదల కానున్న చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సముద్రం ఒడ్డున ఒంటరిగా నిలబడి ఆలోచిస్తున్న యుక్త వయసు పిల్లాడి ఎంట్రీతో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పూర్తిగా యాక్షన్ అండ్ లవ్ స్టోరీగా కనిపిస్తున్న సినిమాలో రక్తం ఏరులై పారగా గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, విజయ్ సేతుపతి పవర్‌ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ చిత్రంలో మరింత పవర్‌ఫుల్‌గా కనిపించనుండగా.. ఈ థ్రిల్లర్ స్టోరీలో సందీప్ సరసన దివ్యాంశ కౌశిక్ నటించింది. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించిన చిత్రానికి సామ్ సి. ఎస్ సంగీతం అందించాడు.

ఇవి కూడా చదవండి : స్విమ్‌ సూట్‌లో రెచ్చిపోయిన Tulasi.. నెటిజన్లు షాక్!


Advertisement

Next Story