దాని కోసం కడుపు తెచ్చుకోవాలా? మీడియాలో సంచలనంగా మారిన హీరోయిన్ పోస్ట్!

by Jakkula Samataha |   ( Updated:2024-05-15 04:05:35.0  )
దాని కోసం కడుపు తెచ్చుకోవాలా? మీడియాలో సంచలనంగా మారిన హీరోయిన్ పోస్ట్!
X

దిశ, సినిమా : ప్రస్తుతం ఎగ్ ఫ్రీజింగ్ అనేది కామన్ అయిపోయింది. ముఖ్యంగా హీరోయిన్స్ దీని వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ మెహ్రీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, మహాను‌భావుడు, ఎఫ్ 2, ఏఫ్3 వంటి సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఆశించినంత ఆఫర్స్ మాత్రం రాలేదు. అడపాదడప సినిమాలు చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తోంది.

అయితే ఈ బ్యూటీ తాజాగా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్న విషయం తెలిసిందే. ఆమె తన గర్భాశయం నుండి అండాలు తీసి భద్ర పరుచుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వచ్చింది. అయితే కొంత మంది మాత్రం ఈ హీరోయిన్ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం లాంటిది చేశారు. మరీ ముఖ్యంగా మెహ్రీన్ పెళ్లి చేసుకోకుండానే తల్లి అవుతుంది పలు కథనాలు రాశారు.

అయితే దీనిపై స్పందించిన హీరోయిన్ మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి గర్భం దాల్చాల్సిన అవసరం లేదు. మీ స్వార్థం కోసం ఏది పడితే అది రాయకూడదు.. జర్నలిస్టులకు బాధ్యత ఉండాలి. అయితనా ఎగ్ ఫ్రీజింగ్ గురించి పూర్తిగా తెలుసుకోండి. పిల్లలు ఇప్పుడే వద్దని భావించే తల్లిదండ్రులు అన్ని విధాలుగా సిద్ధం అయ్యాక పిల్లలను కనేందుకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. కానీ ఎలా పడితే అలా రాయడం కరెక్ట్ కాదు. మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ తెలిపింది. ప్రస్తుతం ఆ నటి చేసిన పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed