ఒక మంచి తల్లికి పుడితే మెగాస్టార్ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ రాయరు: లోబో

by Anjali |   ( Updated:2023-08-14 09:35:40.0  )
ఒక మంచి తల్లికి పుడితే మెగాస్టార్ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ రాయరు: లోబో
X

దిశ, వెబ్‌డెస్క్: మెహర్ రమేష్ దర్వకత్వంలో తెరకెక్కిన ‘భోళా శంకర్’ చిత్రం ఇప్పటికి ఎన్ని విమర్శలు ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీపై వస్తోన్న నెగిటివ్ కామెంట్లపై తాజాగా లోబో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒక సినిమా తీయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తారో మీకు తెలియదు. ఎంతో కష్టపడి మూవీ తీస్తే ఓకే ఒక్క మాటలో బాలేదని నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతారు. ఈ చిత్రంపై నెగిటివ్ కామెంట్లు చేయాల్సిన పని ఏముంది. బ్యాడ్‌ కామెంట్లు చేసేముందు ఒకసారి ఆలోచించండి. ఒక తల్లికి పుడితే ఈ విధంగా మాట్లాడరు.’’ అంటూ లోబో మండిపడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో లోబో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read More: అందరిముందే బ్రా విప్పి ప్రియాంక భర్తపై విసిరిన అమ్మాయి.. వీడియో వైరల్

Advertisement

Next Story