జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ నూతన భవనం.. కోట్లతో నిర్మించిన హౌస్‌లోని సౌకర్యాలు చూస్తే మతిపోవాల్సిందే(వీడియో)

by Anjali |
జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ నూతన భవనం.. కోట్లతో నిర్మించిన హౌస్‌లోని సౌకర్యాలు చూస్తే మతిపోవాల్సిందే(వీడియో)
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. దేశవ్తాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని గుండెల్లో నిలిచిపోయిన ఈ హీరో ప్రస్తుతం దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రిషను ఇందులో అధికారికంగా కథానాయికగా ఎంపిక చేశారు. ఇదంతా పక్కన పెడితే.. మనకు చిరంజీవి ఆస్తుల గురించి తెలిసిందే. లగ్జరీ కార్లు, కోట్ల రూపాయలతో నిర్మించిన హౌసెస్ ఉన్నాయి.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి 100 కోట్ల రూపాయలతో కొత్త నిర్మించారు. అన్ని సౌకర్యాలతో విశాలమైన స్థలంలో చిరు ఇల్లు కట్టారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిల్‌యాని మెగాస్టార్ హౌస్ ను డిజైన్ చేశారు. దాదాపు 25 చదరపు అడుగుల స్థలంలో ఉంటుంది. రెండో ఫ్లోర్‌లో స్మిమ్మింగ్ పూల్ ఉంటుంది.కింద అంతస్తులో దేవుడి గది ఎంతో అందంగా తీర్చిద్దారు. దేవుడి రూంలో మామ రామలింగయ్య అండ్ చిరు తండ్రి ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ ఇల్లు హైదరాబాదులోని జూబ్లిహిల్స్‌లో మర్రి చెన్నారెడ్డి మావవ అభివృద్ధి కేంద్ర సమీపంలో ఉంటుంది. ప్రస్తుతం మెగాస్టార్ నూతన భవనం నెట్టింట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


Advertisement

Next Story

Most Viewed