‘కల్కి’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

by Hamsa |
‘కల్కి’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?
X

దిశ, సినిమా: సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్ ‘కల్కి2898’ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. బాక్సాఫీసు వద్ద రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఈ మూవీని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించగా.. అశ్వనీదత్ నిర్మించాడు. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ సినిమా నిన్న విడుదలవ్వగా.. ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం రివ్యూలు ఇస్తున్నారు.

తాజాగా, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ‘‘ కల్కి 2898 ఏడి గురించి అద్భుతమైన రిపోర్టులు వినిపిస్తున్నాయి. ప్రభాస్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్లతో ఇలాంటి మైథలాజికల్ సై ఫ్యూచరిస్టిక్ సినిమా తీసిన నాగ్ అశ్విన్ క్రియేటివ్ జీనియస్‌కు అభినందనలు తెలుపుతున్నాను. నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ గారికి, ఎంతో అభిరుచి కలిగిన ధైర్యవంతులైన స్వప్న దత్ ప్రియాంక అందరికీ శుభాకాంక్షలు. ఇలా కలలు కంటూనే ఉండండి. ఇండియన్ సినిమా పతాకాన్ని మరింత పైకి ఎగరేస్తూనే ఉండండి’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story