- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఆయనకు భారతరత్న పొందే అర్హత ఉంది’.. చిరంజీవి సంచలన ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత అవార్డ్ ‘భారతరత్న’ ప్రకటించింది. దేశానికి ఆయన చేసిన సేవను గుర్తిస్తూ ప్రభుత్వం భారతరత్న అవార్డుకు ఎంపిక చేసింది. సీనియర్ నేత ఎల్‌కే అద్వానీని భారతరత్న అవార్డ్ వరించడంతో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌కే అద్వానీకి మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభినందనలు తెలిపారు.
‘‘నిస్సందేహంగా దేశ అత్యున్నత అవార్డ్ భారతరత్న పొందే అర్హత ఎల్‌కే అదానీ జీకి ఉంది. మన దేశం చూసిన అత్యంత విశిష్టమైన రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు. స్వాతంత్ర్యానికి పూర్వం, ఆ తర్వాత అనేక దశాబ్దాలుగా దేశ నిర్మాణానికి అదానీ జీ చేసిన కృషి అమూల్యమైనది. అద్వానీ జీ వంటి దిగ్గజాలు దేశ రాజకీయాలను, రాజకీయ నాయకుల స్థాయిని, గౌరవాన్ని పెంచారు. భారతరత్న అవార్డ్‌కు ఎంపికైన అద్వానీ జీకి హృదయపూర్వక అభినందనలు’’ అని చిరు ట్వీట్ చేశారు. కాగా, మెగాస్టార్ చిరంజీవికి సైతం ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే.