ఆ అవసరం నాకు లేదంటూ Megastar Chiranjeevi సెన్సేషనల్ కామెంట్స్

by Javid Pasha |   ( Updated:2022-12-29 09:14:49.0  )
ఆ అవసరం నాకు లేదంటూ Megastar Chiranjeevi సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో పెద్దరికం అనుభవించాలని తనకు లేదని స్పష్టం చేశారు. సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీలో నిర్మించిన నూతన గృహ సమదాయాన్ని గురువారం చిరంజీవి ప్రారంభించారు. లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇండస్ట్రీలో ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడం కనీస బాధ్యతగా భావిస్తానని, అంతేకానీ పెద్దరికం కోసం కాదని తేల్చి చెప్పారు. అయినా ఇండస్ట్రీలో తనకంటే పెద్దవాళ్లు చాలా మంది ఉన్నారని అన్నారు. అవసరం వచ్చినప్పుడు ఇండస్ట్రీకి తన భుజం కాస్తానని పేర్కొన్నారు. సినీ కార్మికులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కోరుకున్న దానికంటే దేవుడు తనకు ఎక్కువే ఇచ్చాడని చిరు తెలిపారు. ఇక సినీ కార్మికుల ఇళ్ల నిర్మాణంలో అక్రమాల గురించి తనకు అవగాహన లేదని మెగాస్టార్ చెప్పారు.

Also Read...

Akkineni Naga Chaitanya : 'కస్టడీ' రీలీజ్ డేట్ ఫిక్స్..

Advertisement

Next Story