ఆ సినిమా కారణంగా యాక్టింగ్‌కు పుల్‌స్టాప్ పెడదామనుకున్న మెగాస్టార్ చిరంజీవి?

by Anjali |   ( Updated:2024-02-18 14:31:56.0  )
ఆ సినిమా కారణంగా యాక్టింగ్‌కు పుల్‌స్టాప్ పెడదామనుకున్న మెగాస్టార్ చిరంజీవి?
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న చిరు గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పట్లో మెగాస్టార్ - ఐరన్ లెగ్ శాస్త్రి కలయికలో తెరకెక్కిన ‘రౌడీ అల్లుడు’ సినిమాను ఎక్కువ సమయం పాటు చిత్రీకరించారట. ఎందుకంటే.. మెగాస్టార్ టెంపోను ఐరన్ లెగ్ శాస్త్రి మెయింటైన్ చేయలేకపోయారట. కాబట్టి ఇద్దరి మధ్య చెప్పే డైలాగులు గానీ, ఎక్స్ప్రెషన్స్ గాని సరిగ్గా మ్యాచ్ కాలేదట. దీంతో చిరు ఎక్కువ సేపు, సన్నివేశాలను రీటేక్‌లు చేయాల్సి వచ్చింది.

ఇక ఆ సమయంలో మెగాస్టార్ నాకు ఈ యాక్టింగ్ వద్దురా బాబోయ్ అని దండం పెట్టి మరి పారిపోవాలనిపించిందట. తెగ చిరాకు వచ్చిందట. ఈ విషయాన్ని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చిరు చేసిన కామెంట్స్‌ను నెటిజన్లు నెట్టింట వైరల్ చేస్తున్నారు. నిజానికి ఈ రీటేకుల విషయంలో చిరంజీవి-ఐరెన్ లెగ్ శాస్త్రి తప్పేం లేదు.

మెగాస్టార్ లాంటి స్టార్ నటుడితో నటించేటప్పుడు ఎవరైన సరే కొంచెం కంగారు పడిపోయి డైలాగులు మర్చిపోవడం, ఎక్స్ప్రెషన్ మిస్ చేయడం లాంటివి చేయడం వల్లే ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయని అప్పట్లో మూవీ టీమ్ చెప్పుకొచ్చింది. చిరు-శాస్త్రి మధ్య కామెడీ సీన్స్ కూడా పెద్దగా సెట్ కాకపోవడంతో ఈ విషయంలో చిరు బాధపడాల్సి వచ్చిందట.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే చెరగని ముద్ర వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా పద్మ విభూషన్ అవార్డు అందుకున్నారు. దీంతో ప్రముఖ పొలిటిషియన్స్, సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికన పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More..

రజనీకాంత్ మూవీ లో నటించేందుకు.. గిల్టీగా ఉంది : బాలీవుడ్ యాక్టర్

Advertisement

Next Story