‘షికారు కొచ్చిన షేర్‌ను బే’.. అదిరిపోయిన ‘భోళా శంకర్’ టీజర్

by GSrikanth |   ( Updated:2023-06-24 14:12:49.0  )
‘షికారు కొచ్చిన షేర్‌ను బే’.. అదిరిపోయిన ‘భోళా శంకర్’ టీజర్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి - మెహర్‌ రమేష్‌ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. చిరు చెల్లిగా మహానటి కీర్తి సురేష్‌ నటిస్తోంది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా.. ఈ సినిమా టీజర్‌ను శనివారం రిలీజ్‌ చేశారు. ‘మొత్తం ముప్పై మూడు మందిని చంపేశాడు సార్‌’ అంటూ మాస్‌ ఎలివేషన్‌తో టీజర్‌ స్టార్ట్ అయింది. ఆపై చిరు మాస్‌ ఎంట్రీ, వీర లెవల్లో ఫైట్‌, విజిల్స్‌ వేయించే డైలాగ్స్‌, కిక్కిచ్చే డ్యాన్స్‌ స్టెప్పులు ఇలా మొత్తంగా టీజర్‌ ఊరమాస్‌గా ఉంది. ‘షికారు కొచ్చిన షేర్‌ను బే’, ‘స్టేట్‌ డివైడ్‌ అయినా అందరూ నా వాళ్లే. ఆల్‌ ఏరియాస్‌ అప్నా హే. నాకు హద్దులు లేవు సరిహద్దులు లేవు.. దేక్‌లేంగే’ అంటూ మెగాస్టార్‌ డైలాగ్స్‌‌‌తో అదరగొట్టేశాడు. టీజర్ ఊహించిన దానికంటే ఎక్కువ హైప్ తీసుకురావడంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Read more:

మరో ఖరీదైన కారు కొన్న మహేష్ బాబు.. హైదాబాద్‌లోనే ఎవరి వద్ద లేదంటా..?



Advertisement

Next Story