స్లీవ్ లెస్ టాప్‌లో మెగా కోడలు గ్లామర్ పిక్స్ వైరల్

by Anjali |   ( Updated:2023-09-06 05:41:19.0  )
స్లీవ్ లెస్ టాప్‌లో మెగా కోడలు గ్లామర్ పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లొట్ట చెంపల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలిగా అడుగు పెట్టబోతుంది. ‘‘అందాల రాక్షసి, దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా’’ లాంటి పలు చిత్రాల్లో నటించి తన క్యూట్‌నెస్‌తో ప్రేక్షకులను అలరించింది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ఐదేళ్లుగా రిలేషన్‌లో ఉండి ఈ ఏడాది జూన్ 9 న హైదరాబాద్‌లోని నాగబాబు నివాసంలో ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు. తాజాగా ఈ అమ్మడు వాయిలేట్ కలర్ స్లీవ్ లెస్ టాప్ ధరించి, తలపై రిబ్బర్ పెట్టుకుని, నడుముపై చేయిపెట్టి.. క్యూట్‌గా కిర్రాక్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ వీక్షించినా నెటిజన్లు పాజిటివ్ కామెంట్లతో లావణ్యను ఆకాశనెత్తుతున్నారు.

Advertisement

Next Story