- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Upasana: వారసుడి విషయంలో చిరంజీవికి సవాల్ విసిరిన ఉపాసన !
దిశ, సినిమా: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పిటల్ అధినేత మనవరాలిగా.. ఆమె సోషల్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొంటూ సామాన్యులకు అండగా నిలుస్తోంది. ఆమె త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో హాప్పీనెస్ నెలకొంది. అయితే తాజాగా చిరంజీవి రాబోయే తన వారసుడి గురించి పలు అసక్తికరమైన విషయాలు తెలిపారు. ‘నేను నా కొడుకుతో కలిసి నటించాను. అంతేకాకుండా నాకో కోరిక ఉంది. అదేంటంటే.. రామ్ చరణ్ వారసుడు పుట్టాక, చరణ్, నేను, నా మనవడు ముగ్గురం కలిసి ఓ మూవీలో నటించాలి. ఇదే నా చివరి కోరిక’ అంటూ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు చిరు. కానీ తాజాగా వినిపిస్తు్న్న సమాచారం ప్రకారం.. ఉపాసన మాత్రం తనకు పుట్టిన వారసత్వాన్ని సినిమాల్లోకి తీసుకురాదట. ‘ పా పిల్లాడిని మూవీస్‌కి, సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంచుతాను’ అని ఉపాసన తన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన చిరు అభిమానులు ‘చిరంజీవి చివరి కోరికను అతని కోడలు తీర్చేలా లేదు’ అంటూ కామెంట్ చేస్తున్నారు.