మెగా కోడలు లావణ్య త్రిపాఠికి అరుదైన వ్యాధి.. పోస్ట్‌తో క్లారిటీ

by Hamsa |   ( Updated:2023-06-30 03:56:04.0  )
మెగా కోడలు లావణ్య త్రిపాఠికి అరుదైన వ్యాధి.. పోస్ట్‌తో క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి 2008లో ‘అందాల రాక్షసి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. 2017లో మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి ‘మిస్టర్’ సినిమాలో నటించింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలో గ్రాండ్‌గా పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఎంగేజ్‌మెంట్ జరిగినప్పటి నుంచి వీరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అయితే కొద్ది రోజుల నుంచి లావణ్య ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా తానే ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ట్రిపోఫోబియా అనే వ్యాధితో పోరాడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యాధి ఉన్నవారు ఏదైనా వింత ఆకారాలను, వింత వస్తువులను, రంధ్రాలు ఉన్న, గడ్డలు కట్టిన వస్తువులను చూసి భయపడడం వంటివి చేస్తుంటారు. అలాగే లావణ్య కూడా అలాంటి వాటిని చూసినప్పుడు భయపడి స్పృహ కూడా తప్పుతుందట. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆమె చాలానే ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అది చూసిన మెగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా, ఈ వార్తలపై మెగా కోడలు ట్విట్టర్ వేదికగా స్పందించింది. నాకు వింత వ్యాధినా? నాకు తెలిసినంత వరకు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు నేను మిమ్మల్ని ఏం చేయాలి? అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకుంటున్నారు.

Also Read: దేవుడా.. కీర్తి సురేష్‌కు ఇప్పటికీ అది వేసుకోవడం రాదా?



Advertisement

Next Story