గుడుంబా శంకర్ రీరిలీజ్ పై స్పందించిన మీరా జాస్మిన్! (వీడియో)

by Anjali |   ( Updated:2023-09-01 15:19:21.0  )
గుడుంబా శంకర్ రీరిలీజ్ పై స్పందించిన మీరా జాస్మిన్! (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పవన్ కి సంబంధించిన పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు రీరిలీజ్ కాగా, తాజాగా పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘గుడుంబా శంకర్’ రీరిలీజ్ కానుంది. 2004 సెప్టెంబర్ 10న రిలీజైన ఈ మూవీ అనుకున్నంతగా హిట్ అవ్వనప్పటికీ పవన్ కళ్యాణ్ స్టైల్ మాత్రం అప్పట్లో బాగా పాపులర్ అయింది. కావున ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీన ఉండగా.. రెండు రోజుల ముందుగానే అంటే ఆగస్టు 31న ఈ మూవీని రీరిలీజ్ చేయనున్నారు.

అయితే తాజాగా దీనిపై ఈ మూవీ హీరోయిన్ మీరా జాస్మిన్ స్పందించింది. '‘గుడుంబా శంకర్’ మూవీ నాకు చాలా స్పెషల్. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం నాకు మంచి ఎక్స్ పీరియన్స్. ఈ మూవీ షూటింగ్ లో మేము చాలా ఎంజాయ్ చేశాం. ఇన్నేళ్లు అయినా మీ ప్రేమ మాత్రం అలాగే ఉంది. మూవీ టీం అందరికీ థాంక్స్. ముఖ్యంగా పవన్ ది గుడ్ హార్ట్. హ్యుమానిటీ పర్సన్’ అంటూ చెప్పుకొచ్చింది మీరా. ఇక ఈ వీడియో చూసిన జనాలు ‘మీరా జాస్మిన్ మీరు ఇప్పటికి కూడా అంతే అందంగా ఉన్నారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story