మీనాకు ఆ నటుడితో రెండో పెళ్లి : తమిళ నటుడి వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2023-03-25 15:09:28.0  )
మీనాకు ఆ నటుడితో రెండో పెళ్లి : తమిళ నటుడి వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు తన నటనతో కుర్రకారును ఉర్రూతలూగించిన నటి మీనా త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి వార్తలు చ‌క్కర్లు కొడుతున్నాయి. అలాంటి వార్తలకు సమాధానంగా ఎప్పటికప్పుడు వాడిని ఖండిస్తూ వ‌స్తున్నారు. అయినప్పటికీ మీనా రెండో పెళ్లికి విషయంలో గుసగుసలకు ఏమాత్రం ఎండ్ కార్డ్ పడటం లేదు. తాజాగా త‌మిళ న‌టుడు బెయిల్వన్ రంగనాథన్ మీనా రెండో పెళ్లిపై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

ఓ తమిళ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయ‌న మాట్లాడుతూ.. మీనాకు జూలై నెలలో 39 ఏళ్ల పాన్ ఇండియా స్టార్ తో వివాహం జ‌ర‌గ‌నుందంటూ సంచలన విషయం వెల్లడించాడు. దీంతో ఆ న‌టుడు ఎవ‌రా అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. కాగా, గతంలోనే మీనా రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదంటూ ఓ ఇంటర్య్వూలో బహిరంగంగానే తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో రంగ‌నాథ‌న్ వ్యాఖ్యలపై మీనా అభిమానులు కూడా ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

విడాకులు తీసుకున్న హీరోతో పెళ్లికి సిద్ధమైన నటి మీనా?

Advertisement

Next Story