ఓటీటీలోకి ‘మత్తు వదలరా 2’.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే?

by sudharani |   ( Updated:2024-10-02 14:57:15.0  )
ఓటీటీలోకి ‘మత్తు వదలరా 2’.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే?
X

దిశ, సినిమా: చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అందుకున్న మూవీస్‌లో ‘మత్తు వదలరా’ ఒకటి. ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా ‘మత్తు వదలరా 2’ వచ్చిన విషయం తెలిసిందే. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. ఇక శ్రీ సింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ‘మత్తు వదలరా 2’ సెప్టెంబర్ 13న రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ‘మత్తువదలరా 2’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 11 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు చూస్తుందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed