MATKA: ‘మట్కా’ నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్.. హైప్ పెంచేస్తున్న పోస్టర్

by Kavitha |
MATKA: ‘మట్కా’ నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్.. హైప్ పెంచేస్తున్న పోస్టర్
X

దిశ, సినిమా: వరుణ్ తేజ్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘మట్కా’. ఈ మూవీకి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో 1960 బ్యాక్‌డ్రాప్‌తో గ్యాంబ్లింగ్ తరహా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.

ఈ క్రమంలో తాజాగా మట్కా సినిమా నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసారు. ఈ లుక్ చూస్తుంటే వరుణ్ తేజ్ డాన్‌గా, తనకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు అని తెలుస్తోంది. గ్యాంబ్లింగ్ ఏరియాకు హెడ్‌గా ఉన్నట్టు కనిపిస్తుంది. దీంతో ఈ మూవీపై భారీగానే అంచనాలు పెరిగాయి. ఇక గత కొన్నాళ్లుగా మంచి హిట్‌ను చేజిక్కికోని వరుణ్‌కి ఈ ప్రయోగం అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.




Advertisement

Next Story