ఆ హీరోయిన్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్ పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-08-11 06:29:11.0  )
ఆ హీరోయిన్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌కు ఫుల్ పాపులారిటీ ఉంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోయిన్ విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన లక్ష్మీ మీనన్‌ను త్వరలోనే విశాల్ వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగుతోంది.

తాజాగా, హీరో విశాల్ పెళ్లి వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘సాధారణంగా నేను నా గురించి ఎలాంటి ఫేక్ న్యూస్ లేదా రూమర్స్ వచ్చినా వాటికి స్పందించను. అనవసరం అనుకుని వదిలేస్తాను. కానీ, ఈసారి స్పష్టత ఇవ్వాల్సి వస్తుంది. లక్ష్మీ మీనన్ తో నా వివాహం అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను పూర్తిగా ఖండిస్తున్నాను. లక్ష్మీ మీనన్ ఒక హీరోయిన్ కంటే కూడా అమ్మాయి. ఆమె వ్యక్తిగత జీవితం, ఇమేజ్ దెబ్బతీసేలా ఈ వార్తలు ఉన్నాయి. అందుకే నేను స్పష్టత ఇచ్చాను. నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను అనేది అనవసరమైన చర్చ.టైం వచ్చినప్పుడు జరుగుతుంది. మీరు ఇకనైనా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. దేవుడు చల్లగా చూడాలి’’ అంటూ రాసుకొచ్చారు.

Read More: పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. వరుడు అతడేనంట?

Advertisement

Next Story