Manmadha Movie: ‘మన్మధ’ సినిమా రీ రిలీజ్.. ఎప్పుడంటే..?

by Prasanna |
Manmadha Movie: ‘మన్మధ’ సినిమా రీ రిలీజ్.. ఎప్పుడంటే..?
X

దిశ , వెబ్ డెస్క్ : శింబు, జ్యోతిక జంటగా నటించిన మన్మధన్ సినిమా తెలుగులో మన్మధ పేరుతో విడుదలైంది. ఈ మూవీలో శింబు యాక్టింగ్ ప్రతీ ఒక్కరికి గుర్తుటుంది. తమిళ్, తెలుగులో పెద్ద హిట్ అయింది. ఇటీవలే RX100, బేబీ సినిమాల గురించి అందరూ ఎలా మాట్లాడుకున్నారో .. ఆ రోజుల్లో ఈ మూవీ కూడా అలాంటి హైప్ నే క్రియోట్ చేసింది.

ఈ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఈ మూవీ సాంగ్స్ వింటూనే ఉంటాము. తాజాగా, ఈ సినిమాను మళ్ళీ ప్రేక్షకుల ముందుకుబ్ తీసుకురావాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 5న మన్మధ సినిమా రీ రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాని ఇప్పుడు సాయి సుధా రాచకొండ, అజిత్ కుమార్ సింగ్, వేమూరి శ్రేయస్, రమణ మన ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీలో శింబు డ్యూయల్ రోల్ లో మెప్పించాడు. ఇప్పుడు విజయ్, కార్తీ, సూర్య అని ఎలా చెప్పుకుంటున్నామో .. వీరి కంటే ముందే శింబు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మన్మధ మూవీతో తెచ్చుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed