డార్లింగ్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్.. ‘కన్నప్ప’ సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ.. ఏ పాత్రలో అలరించన్నాడంటే..

by Javid Pasha |   ( Updated:2024-05-10 12:41:39.0  )
డార్లింగ్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్.. ‘కన్నప్ప’ సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ.. ఏ పాత్రలో అలరించన్నాడంటే..
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘కన్నప్ప’ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే పలువురు నటీ నటులు చిత్రీకరణలో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా డార్లింగ్ కూడా సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్ ఇచ్చాడు మంచు విష్ణు. ప్రభాస్ షూటింగ్‌లో పాల్గొన్నరంటూ ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో కూడా షేర్ చేశాడు. కాగా ఇందులో డార్లింగ్ కటౌట్ మొత్తం కనిపించలేదు. కేవలం కాళ్లు, పాదుకలు, పులిచర్మం వంటి కొన్ని భాగాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానుల్లో తమ హీరో రోల్ ఎలా ఉండబోతోందనే విషయంపై ఆసక్తి నెలకొంది.

ఇంకోవైపు ‘కన్నప్ప’లో ప్రభాస్ శివ భక్తుడైన నందీశ్వరుడిగా కనిపించనున్నాడనే వార్తలు కూడా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కూడా డార్లింగ్ శివుడి పాత్రలో కనిపిస్తాడనే టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. కాగా కొన్నిరోజుల కిందట బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా ‘కన్నప్ప’ షూటింగ్‌లో పాల్గొని తన రోల్‌కు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసుకున్నాడు. అయితే అక్షయ్ ‘ఓ మై గాడ్’ చిత్రంలో శివుడి పాత్రలో కనిపించగా ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ‘కన్నప్ప’లో కూడా అతను ఇదే పాత్రలో కనిపించనున్నట్లు డిస్కషన్ అయితే నడుస్తోంది. కానీ మూవీ టీమ్ నుంచి అయితే ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ‘కన్నప్ప’ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. డైరెక్టర్ ముఖేశ్ కుమార్‌ సింగ్‌ దీనిని తెరకెక్కి‌స్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమాలోని ఓ కీలకపాత్రలో మంచు విష్ణు కూడా కనిపించనున్నాడు. ఆయనతోపాటు మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, శరత్‌కుమార్‌, మధుబాల తదితరులు తమ తమ స్థాయిలో అలరించనున్నారు.

Advertisement

Next Story