Manchu Vishnu: ఇలాంటి మాటలు అనేటప్పుడు ఆలోచించుకోవాలి.. మంచు విష్ణు సీరియస్

by sudharani |   ( Updated:2024-08-23 14:47:53.0  )
Manchu Vishnu: ఇలాంటి మాటలు అనేటప్పుడు ఆలోచించుకోవాలి.. మంచు విష్ణు సీరియస్
X

దిశ, సినిమా: ప్రజెంట్ సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అర్షద్ వార్సీ. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘కల్కి’ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్‌పై అర్షద్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆ మూవీలో ప్రభాస్ జోకర్‌లా కనిపించాడు అంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్‌పై టాలీవుడ్ సినీ నటులతో పాటు ప్రేక్షకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా రియాక్ట్ అవుతూ.. సినీ అండ్ టీవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ థిల్లాన్‌కు లేఖ రాశాడు.

అందులో.. ‘ఎవరి అభిప్రాయాలు చెప్పే హక్కు వాళ్లకు ఉంటుందన్న విషయాన్ని గౌరవిస్తున్నాం. అయితే ప్రభాస్‌ను తక్కువ చేస్తూ అతడు చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు. వార్సీ కామెంట్స్ తెలుగు సినీ రంగంలోని వాళ్లవే కాదు అభిమానుల మనోభావాలను కూడా దెబ్బతీశాయి. ఓ పబ్లిక్ ఫిగర్‌గా తాను మాట్లాడే ప్రతి మాటపై ఎంతో చర్చ జరుగుతుందన్న విషయాన్ని అతడు గుర్తించాల్సింది. దురదృష్టవశాత్తూ మిస్టర్ వార్సీ చేసిన కామెంట్స్ సినిమా లవర్స్‌లో, మన సినీ సమాజంలో అనవసర నెగటివిటీని సృష్టించాయి. అది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో తన తోటి నటీనటులపై అర్షద్ వార్సీ అలాంటి కామెంట్స్ చేయకుండా ఉండాలని మేము సూచిస్తున్నాం. ప్రాంతాలతో సంబంధం లేకుండా మన సినీ సమాజంలోని ప్రతి వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవ, మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేస్తున్నాం’ అంటూ మంచు విష్ణు ఆ లేఖలో పేర్కొన్నాడు.

Twitter link : https://x.com/SureshPRO_/status/1826873818234913034

Advertisement

Next Story