Pawan Kalyan రాజకీయ భవిష్యత్తు చెప్పడానికి నేనేమైనా బ్రహ్మం గారినా : Manchu Vishnu

by Anjali |   ( Updated:2023-08-17 14:00:20.0  )
Pawan Kalyan రాజకీయ భవిష్యత్తు చెప్పడానికి నేనేమైనా బ్రహ్మం గారినా : Manchu Vishnu
X

దిశ, సినిమా: సినిమాల విషయం పక్కన పెడితే ప్రజంట్ మా అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు మంచు విష్ణు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. ఇందులో భాగంగా ‘జనసేన పార్టీ అధినేత, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అవుతాడా?’ అనే ప్రశ్న మంచు విష్ణుకు ఎదురైంది. కాగా ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘నేనేమైనా బ్రహ్మం గారినా.. ఆయన సక్సెస్ అవుతారా? అవరా? అని చెప్పడానికి. సినిమాల పరంగా ఆయన గురించి అడగండి చెప్తా. ఎందుకంటే ఆ విషయంలో ఆయన ఓ సూపర్ స్టార్. దీంట్లో నో డౌట్. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఎంత పెద్ద స్టార్ అనేది అందరికీ తెలుసు. ఆయన కెరీర్‌లో మూవీ ఆడకపోయినా.. రెట్టింపు కలెక్షన్లు వస్తాయి. అది తన పవర్. చెప్పాలంటే ఏదైనా జనాల చేతిలో ఉంటుంది. వారికి నచ్చితేనే సినిమా చూస్తారు. నచ్చిన వారికే ఓటేస్తారు’ అని ఆయన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పాడు.

Advertisement

Next Story