ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. సినీ రంగంలో, రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న Manchu Manoj..!

by sudharani |   ( Updated:2023-08-04 14:05:26.0  )
ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. సినీ రంగంలో, రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న Manchu Manoj..!
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ సెలబ్రిటీల గురించి నెట్టింట ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. అందులోను మంచు ఫ్యామీలీకి సంబంధించిన న్యూస్ అయితే హాట్ టాపిక్‌గా వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే మంచు మనోజ్‌ ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలవడంతో నెట్టింట పెద్ద చర్చ జరిగింది. మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు.. అతడు టీడీపీలో మరో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బ్లెస్సింగ్స్ తీసుకునేందుకు వెళ్లాము అంటూ చెప్పారు. కానీ రాజకీయంగా మాత్రం ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్‌మేషన్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా మనోజ్‌పై మరో న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే..

మనోజ్ ఇప్పుడు ఓ సరికొత్త టాక్ షో చేయబోతున్నాడట. ఇది కేవలం సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీస్ వచ్చే టాక్ షో కాదట. పలువురు బడా రాజకీయ నేతలను కూడా ఈ షో కు ఇన్వైట్ చేస్తారట. ఇది మొత్తం పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండబోతున్నట్లు టాక్. ఇంకో విషయం ఏంటంటే.. ఈ షోని డిజైన్ చేస్తుంది.. ప్రొడ్యూస్ చేస్తుంది పవన్ కళ్యాణ్ ‘బ్రో’ చిత్ర నిర్మాతలు కావడం విశేషం. ఇది ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రచారం. త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతున్నట్లు వినికిడి. కాగా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా మనోజ్ ఒక్క షోతో అటూ సినీ ఇండస్ట్రీలో.. ఇటూ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story