- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manchu Manoj: మంచు మనోజ్ నేను నీ వెంట నిలబడతాను.. వైరల్‌గా భూమా మౌనిక పోస్ట్
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మనోజ్‌తో పెళ్లికి ముందే మౌనికకు ఓ కొడుకు ఉన్నాడు. ఇప్పుడు మనోజ్‌తో మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే తన కొడుకు ధైరవ్ పుట్టి సంవత్సరం అయినా సందర్భంగా.. కొడుకుకు బర్త్‌డే విశెష్ చెబుతూ స్పెషల్ పోస్ట్ పెట్టింది మౌనిక. ఈ మేరకు ‘నా సన్-షైన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ శక్తి, ప్రేమ, చిరునవ్వులు ప్రతిరోజూ నన్ను మరింత బెటర్ వ్యక్తిగా మార్చుతున్నాయి. నా జీవితంలోకి వచ్చినందుకు.. నన్ను నీ తల్లిగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జురుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నాకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు నా చీర్ లీడర్. నువ్వు నా కోసం చూసే ఎదురు చూసే విధానం నాకు చాలా ఇష్టం. నీ అల్లరితో నేను కూడా చిన్నపిల్లని అయిపోతున్నాను. ఈ భూమిపై నా జీవితాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు ధైరవ్. శోభా అమ్మమ్మ, భూమా తాత, నిర్మలా నానమ్మ, బాబు తాత తమ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు నిన్ను, మనల్ని ఎప్పుడూ కాపాడాలని కోరుకుంటున్నాను. @manojkmanchu నేను ఎల్లప్పుడూ మీ వెంట ఉంటాను. నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.