పొట్టి గౌనులో రచ్చ చేస్తున్న మంచు లక్ష్మి.. ఈ వయసులో అవసరమా అంటున్న నెటిజన్లు.

by Prasanna |   ( Updated:2023-12-16 13:40:06.0  )
పొట్టి గౌనులో రచ్చ చేస్తున్న మంచు లక్ష్మి.. ఈ వయసులో అవసరమా అంటున్న నెటిజన్లు.
X

దిశ, సినిమా: మంచు లక్ష్మి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు పెద్దగా చిత్రాలు చేయకున్నా నటించినంత వరకు నటిగా మంచి గుర్తింపు మాత్రం సంపాదించుకుంది. ప్రజంట్ అవకాశాల కోసం చిత్ర పరిశ్రమలో లేడీ విక్రమార్కుడిలా అలుపెరగని పోరాటం చేస్తుందని చెప్పాలి. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా ట్రెండీ లుక్‌లో దర్శనమిస్తూ ఉంటుంది.

ఇందులో భాగంగా తాజాగా షార్ట్ ఫ్రాక్‌లో హాట్ లుక్‌లో మెరిసింది మంచు లక్ష్మి. దీంతో ఇది చూసిన యాంటీ ఫ్యాన్స్ ఎప్పటిలాగే ట్రోల్ మొదలెట్టారు. ‘నీకు అంత పొట్టి గౌను అవసరమా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ మంచు లక్ష్మి విమర్శలను పట్టించుకోదు.. ఎందుకంటే మంచు ఫ్యామిలీని ట్రోల్ చేయడానికి, ఇప్పటికే చాలా యూట్యూబ్ ఛానల్స్, మీమ్ పేజెస్ ఉన్నాయి. ఇందులో మంచు లక్ష్మి భాష, బిహేవియర్‌ని తరచుగా యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటారు కానీ వాటిని పెద్దగా పట్టించుకోదు ఈ అమ్మడు.

Advertisement

Next Story