పవన్ కల్యాణ్‌పై మంచు లక్ష్మి ఆసక్తికర కామెంట్స్..

by Hamsa |   ( Updated:2024-06-22 12:57:26.0  )
పవన్ కల్యాణ్‌పై మంచు లక్ష్మి ఆసక్తికర కామెంట్స్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆమె ఇటీవల యక్షిణి మూవీలో నటించి మెప్పించింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి ఎన్నికల్లో విజయం సాధించి డిప్యూడీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ రాజకీయాలు అనేది నాయకులకు ఒక ప్రత్యేక ప్రపంచం వంటిది. పవన్ కల్యాణ్ యాక్టర్‌గా ఉంటూనే చాలామంది నటీనటుల ప్రేమను పొందారు. వారి ప్రేమను పక్కకు పెట్టి రాజకీయాల్లోకి వెళ్లారు. ఆయనకు డబ్బు, ఫేమ్ వంటివి అవసరం లేదు. ఎందుకంటే.. ఆయన ఫేమ్‌నే వేరేవాళ్లు వాడుకుంటారు.

పాలిటిక్స్ అంటేనే మంచి చేసినా చెడు చేసినట్లు చెప్తారు. అయితే అవన్నీ నిలదొక్కుకుని పవన్ ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యారంటే అది మామూలు విషయం కాదు. ఆయన ఎక్కడా రాజకీయాలను వదిలేయలేదు. ఇప్పుడు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడు. జనాలకు నేను ఎందుకు సేవ చేయాలి అని అనుకోరు. ఎన్ని మాటలు అన్నా అలాగే నిలబడ్డారు. ఆయనకు వచ్చిన విజయం నిజంగా ఎంతో స్పూర్తిదాయకం. జగన్ కూడా ఫీల్ అవుతుండవచ్చు ఎన్ని పథకాలు ఇచ్చా అన్ని ఫ్రీగా ఇచ్చాను. అయినా నన్ను ఓడించారు అని. కానీ ఐదేళ్లకే ఆయనకు అలా అయింది. పదేళ్లు అయినా అలాగే అనుకోవచ్చు. విజయం రాలేదని ఆయన బాధపడుతుండొచ్చు కానీ వాళ్లంతా రాజకీయ నాయకులు. కాబట్టి కొద్ది కాలం అయ్యాక ఇవన్నీ కామన్ అనుకుంటారు’’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed