- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూట్యూబ్ ఛానల్స్ విష ప్రచారం చేస్తున్నాయి.. నటి ఆందోళన
దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ మమతా మోహన్‌దాస్ తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసింది. సుధీర్ఘ కాలంపాటు క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన నటి.. తను చికిత్స తీసుకుంటున్న సమయంలో ఫొటోస్ షేర్ చేస్తూ ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించింది. అయితే అప్పటినుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న బ్యూటీ.. ఈ మధ్య రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయింది.
కానీ ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రాకపోవడంతో.. మమత మరోసారి క్యాన్సర్ బారిన పడిందంటూ ప్రచారం మొదలైంది. కాగా దీనిపై స్పందించిన ఆమె.. 'నా ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అబద్ధాలే. అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందవద్దు. నన్ను ఇంటర్వ్యూ చేశామని చెప్పుకుంటున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విష ప్రచారం చేస్తున్నాయి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా. మళ్లీ క్యాన్సర్ బారిన పడలేదు. ఏదైనా నేనే ప్రకటిస్తా. అప్పటిదాకా మీరు విన్నవి లేదా చదివినవి నమ్మకండి' అని స్పష్టం చేసింది.