అలా బతకడం నా వల్ల కాదు.. కావాలంటే అతన్ని అడగండి: మాళవిక

by Prasanna |   ( Updated:2023-10-06 07:34:45.0  )
అలా బతకడం నా వల్ల కాదు.. కావాలంటే అతన్ని అడగండి: మాళవిక
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మాళవికా మోహనన్ ఏ విషయంలోనైనా నిజాయితీగానే నడుచుకుంటానంటోంది. ప్రస్తుతం విక్రమ్ హీరోగా పా.రంజిత్ తెరకెక్కిస్తున్న ‘తంగలాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆమె.. రీసెంట్‌గా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులు, ఫాలోవర్స్‌తో చిట్ చాట్ నిర్వహించింది. ఈ క్రమంలోనే తన అలవాట్లు, అభిరుచులు, డ్రీమ్స్ గురించి మాట్లాడింది. ఈ మేరకు ‘తంగలాన్‌’ ఎందుకు లేటు అవుతుంది? మీ క్యారెక్టర్ గురించి చెప్పగలరా? అనే ప్రశ్నలకు బదులిస్తూ.. ‘ఈ విషయం పా.రంజిత్‌ని అడగాలి. నా వరకైతే ‘తంగలాన్‌’ స్పెషల్ మూవీ. ఈ క్యారెక్టర్‌లో నటించడం పెద్ద సవాల్‌‌. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా’ అని చెప్పింది. అలాగే తనకు ఇష్టమైన హీరో ‘ఫహాద్‌ ఫాజిల్‌’ అని చెప్పేసిన నటి తానెప్పుడూ అబద్ధాల్లో బతకలేనని, ఏ అభిప్రాయమైనా ముక్కు సూటిగా చెప్పేస్తానంది. చివరగా రాజకుమారిగా పీరియాడికల్‌ మూవీ చేయాలనేది తన డ్రమ్ అంటూ మనసులో మాట బయటపెట్టింది.

Advertisement

Next Story

Most Viewed