Malavika Mohanan: ఆ జ్ఞాపకాలు ఎప్పటికి మర్చిపోలేను.. ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by sudharani |
Malavika Mohanan: ఆ జ్ఞాపకాలు ఎప్పటికి మర్చిపోలేను.. ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హీరోయిన్ మాళవిక మోహనన్. తాజాగా ‘తంగలాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్, మాళవి మోహనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి పా. రంజిత్ దర్శతక్వం వహించాడు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై రిలీజ్‌కు మందు నుంచే భారీ అంచనాలు ఉండగా.. ఆగస్టు 15కు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. దీంతో తాజాగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. ‘‘తంగలాన్’లో విక్రమ్‌‌తో యాక్ట్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన గొప్ప నటుడు. ఈ సినిమా షూటింగ్‌ రోజులను ఎప్పటికీ మరచిపోలేను. ఇలాంటి విభిన్నమైన, బలమైన పాత్రలను తెరకెక్కించడం సాహసం. ఈ సినిమాను ఇంత గొప్పగా చిత్రీకరించడానికి టీమ్‌ ఎంతో కష్టపడింది. ఆ కష్టాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించి సక్సెస్‌ను ఇచ్చారు. ఇప్పుడు ‘తంగలాన్’ ఆగస్టు 30న బాలీవుడ్‌లో రిలీజ్‌ కానుంది. ఆరోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. హిందీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్మకముంది’ అని చెప్తూ.. త్వరలోనే ప్రభాస్ ‘రాజాసాబ్‌’తో తెలుగు ఆడియన్స్‌ను ముందుకు రాబోతున్నాను. ఈ సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed