- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకప్ తర్వాత తొలిసారి స్పందించిన మలైకా అరోరా.. 'నేను నన్ను ఒంటరి చేసుకున్న అంటూ
దిశ, సినిమా: బాలీవుడ్ లవ్లీ కపూల్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ అందరికీ సుపరిచితమే. పెళ్లి చేసుకోకుండా చాలా కాలం నుంచి రిలేషన్‌లో ఉంటున్నారు ఈ జంట. అయితే వీరిద్దరూ విడిపోతున్నారని చాలా రోజులనుంచి ఓ వార్త వినిపిస్తోంది. రీసెంట్‌గా అర్జున్ కపూర్ బర్త్‌డేకి మలైకా విషెష్ కూడా చెప్పలేదు. దీంతో ఈ జంట విడిపోతున్నారని బాలీవుడ్‌లో టాక్ గట్టిగానే వినిపించింది. అయితే తాజాగా మలైకా దీనిపై స్పందించింది.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలైకా విడాకుల పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. 'ఏం జరిగినా నిజమైన ప్రేమ అనే భావనపై నమ్మకం కోల్పోను. వృశ్చిక రాశి వారు అంతే.. ప్రేమ కోసం చివరి వరకు పోరాడతాం' అని తెలిపింది. 'నేను నన్ను ఒంటరి చేసుకున్న అనే విషయం కాలక్రమేణా నేను నేర్చుకున్న. ఈ విషయాలు నన్ను ప్రభావితం చేయలేదని నేను చెబితే.. నేను అబద్ధం చెప్పినట్టు అవుతుంది అని ఆమె తెలిపింది.
అలాగే మలైకా సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి మాట్లాడుతూ.. 'ఎన్ని ప్రతికూలతలు నన్ను చుట్టుముట్టినప్పటికీ, అది నన్ను ప్రభావితం చేయనివ్వను. అది వ్యక్తులు గురించైనా నా వర్క్ లేదా సోషల్ మీడియా గురించైనా నేను పట్టించుకోను. ఆ నెగటివ్ ఎనర్జీని నేను అనుభవించిన క్షణం నేను వారి నుండి దూరంగా ఉంటాను. మొదట్లో నాకు అలాంటి వాటితో విసుగు వచ్చేది. రాత్రుళ్లు నిద్ర కూడా పట్టేది కాదు. నేను కూడా మనిషినే, నాకు ఏడుపు వస్తుంది, నేను కూడా అలసిపోయాను,' అని చెప్పుకొచ్చింది.