- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mr. Bachchan: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. పలువురు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా మిస్టర్ బచ్చన్‌లో అనవసరమైన సీన్స్ ఉండటం వల్ల సినిమా ల్యాగ్ అయిందనే వాదన కూడా ఉంది.
ఇక నెటిజన్ల పోస్టులు నెట్టింట వైరల్ అవడంతో మేకర్స్ ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమాను 13 నిమిషాల నిడివి తగ్గిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ పెట్టారు. అంతేకాకుండా.. ‘‘ సోషల్ మీడియాలో వస్తున్న క్రిటిసిజం, ఫీడ్ బ్యాక్ ఆధారంగా తీసుకుని నిడివిని 13 నిమిషాలు తగ్గించాం. దీంతో ఇప్పుడు ఈ మూవీ మరింత ఆసక్తికరంగా ఆకర్షణీయంగా ఉంటుందని నమ్ముతున్నాం’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండటంతో రవితేజ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. రాఖీ పండుగ, లాంగ్ వీకెండ్ వస్తుండటంతో సినిమా హిట్ కొట్టడంతో పాటు కలెక్షన్లు కూడా బాగానే రాబడుతుందని అభిప్రాయ పడుతున్నారు.
Taking in all the criticism and feedback, #MrBachchan is now trimmed by 13 minutes to make it even more racy and engaging.
— People Media Factory (@peoplemediafcy) August 16, 2024
Do not miss the 𝗠𝗔𝗦𝗦 𝗠𝗔𝗛𝗔 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 in theatres near you ❤️🔥
Book your tickets now!
🎟️ https://t.co/fBC3B1CnCW#MassReunion
Mass… pic.twitter.com/qAw6K7xQ5V