పాకిస్థాన్ నటిపై క్రూరమైన ట్రోలింగ్.. డ్రామాలు చేస్తోదంటూ

by sudharani |   ( Updated:2022-09-03 11:41:35.0  )
పాకిస్థాన్ నటిపై క్రూరమైన ట్రోలింగ్.. డ్రామాలు చేస్తోదంటూ
X

దిశ, సినిమా : పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ నెట్టింట విమర్శలపాలవుతోంది. ఇటీవల పాక్‌లో సంభవించిన వరదల కారణంగా బాధితులకు ఆర్థిక సాయంతోపాటు తమకు తోచిన హెల్ప్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. 'వరద బాధితులను రక్షించే లక్ష్యంతో టెంట్లు, ఆహారం & వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాం. మా వాలంటీర్లు పరిమితిని దాటి బాధితులకు సహాయం చేస్తున్నారు. మీవంతుగా విరాళం ఇచ్చి మాతో చేరండి' అంటూ ఓ బాలుడి ఫొటోను జతచేస్తూ ట్వీట్‌లో రాసుకొచ్చింది.

ప్రస్తుతం అది వైరల్ అవుతుండగా కొంతమంది 'నిజమైన రాణి' అంటూ నటిని పొగిడేస్తుంటే.. మరికొందరు మాత్రం 'మహి మీ డ్రామాలతో సినిమాలు విజయవంతం అవుతాయి. కానీ, ప్రజల జీవితాలు కాదు. ఎల్లప్పుడూ ప్రజల డబ్బు కొల్లగొట్టడానికే ప్రయత్నిస్తారా? అలాగైతే మీ సంపాదనకు అర్థం ఏముంది?' అంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed