మహేష్ బాబు సంచలన నిర్ణయం.. ఇక చిరస్మరణీయంగా సూపర్ స్టార్ కృష్ణ పేరు

by sudharani |   ( Updated:2022-11-30 09:42:14.0  )
మహేష్ బాబు సంచలన నిర్ణయం.. ఇక చిరస్మరణీయంగా సూపర్ స్టార్ కృష్ణ పేరు
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీలో, అభిమానుల్లో విషాదాన్ని నింపింది. మహేశ్ బాబు కుటుంభానికి చాలా మంది సినీ తారలు, రాజకీయవేత్తలు, అభిమానులు ధైర్యాన్ని చెప్పారు. కృష్ణ మరణం అనంతరం మహేష్ బాబు బయటకు రావడం కూడా మానేశారు. తన తండ్రి కర్మ రోజు మాత్రం అభిమానులను పిలిచి వారికి భోజనాలు పెట్టారు. అదే రోజు కృష్ణను తలుచుకుంటూ మహేష్ బాబు చాలా భావోద్వేగానికి గురయ్యారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ బాబు తన తండ్రి పేరు చిరస్మరణీయంగా.. ఇండస్ట్రీలో, అభిమానుల్లో నిలిచిపోవాలని ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేంటంటే.. సూపర్ స్టార్ కృష్ణ పేరు మీదుగా అవార్డులు ఇవ్వాలని మహేష్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అది ఆషామాషీగా కాకుండా.. నేషనల్ లెవల్‌లో ది బెస్ట్ అనిపించుకున్నవారికి కృష్ణ మొమెంటోతో పాటు లక్షల రూపాయిలు ప్రైజ్ మనీ ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని కుటుంబసభ్యులతో కూడా చర్చించి ఫైనల్ చేశారని టాక్. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఇది విన్న కృష్ణ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : త్రివిక్రమ్-మహేష్ మూవీ.. కీలక పాత్రలో శోభన

Advertisement

Next Story

Most Viewed