మాస్ మహారాజ మూవీకి మహేష్ బాబు వాయిస్.. ఈ సారి బ్లాక్ బస్టరేనట!

by Prasanna |   ( Updated:2023-05-23 06:24:38.0  )
మాస్ మహారాజ మూవీకి మహేష్ బాబు వాయిస్.. ఈ సారి బ్లాక్ బస్టరేనట!
X

దిశ, సినిమా: మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావ్’. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఓ దొంగ బయోపిక్ అని తెలియగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు‌తో పాటుగా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. టీజర్ కూడా అన్ని భాషల్లో విడుదల కాబోతోంది. అయితే ఈ టీజర్ ప్రారంభానికి ముందు ఒక వాయిస్ ఓవర్ అవసరం కచ్చితంగా ఉంటుందట. రీసెంట్ ఈ టీజర్‌కు సంబంధించిన హిందీ వాయిస్ ఓవర్ జాన్ అబ్రహం అందించాడు. అలాగే తమిళ్ వెర్షన్ టీజర్‌‌కు కార్తీ, కన్నడ వెర్షన్‌కి శివ రాజ్ కుమార్, మలయాళ వెర్షన్‌కి దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్ అందించారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ టీజర్‌కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Read More: K.Raghavendra Rao: నేడు డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు పుట్టిన రోజు

Advertisement

Next Story