Mahesh babu: మహేశ్ బాబు - రాజమౌళి కాంబోలో కొత్త మూవీ.. టైటిల్ ఇదేనా?

by Javid Pasha |
Mahesh babu: మహేశ్ బాబు - రాజమౌళి కాంబోలో కొత్త మూవీ.. టైటిల్ ఇదేనా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఓ కొత్త సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఆ మూవీకి సంబంధించిన వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత జక్కన దర్శకత్వంలో మరో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. కాగా మూవీ యూనిట్ మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇకపోతే జక్కన్న, మహేశ్ బాబు కాంబోలో వస్తున్న మూవీ టైటిల్‌కు సంబంధించి కూడా పలు వార్తలు వినిపించాయి. కానీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏదీ లేకపోవడంతో అవన్నీ నిజం కాదని తేలిపోయింది. ఇదిలా ఉండగా.. ఆగష్టు 9న మహేశ్ బాబు బర్త్ డే కావడంతో ఆరోజు మూవీకి సంబంధించిన శుభవార్త ఉంటుందని ప్రేక్షకులు భావిస్తుండగా.. ఇప్పటికే టైటిల్ కూడా డిసైడ్ అయ్యిందంటూ మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఏంటంటే.. మహేశ్-జక్కన్న కాంబోలో వస్తున్న సినిమాకు ‘గోల్డ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని, చిత్ర యూనిట్ ప్రకటించడమే తరువాయి అని, మహేశ్ పుట్టిన రోజున గుడ్ న్యూస్ ఉంటుందని కొందరు డిస్కస్ చేస్తున్నారు. అంతేకాకుండా అదే రోజు ఇతర నటీ నటుల పేర్లుతో పాటు ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారని ఇంకొందరు పేర్కొంటున్నారు. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ, మహేశ్-జక్కన కాంబోలోని కొత్త సినిమాకోసం మాత్రం సినీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.



Next Story