Namrata-Mahesh Babu: సూపర్‌స్టార్‌ను అమ్మకానికి పెట్టిన నమ్రత.. మండిపడుతోన్న ఫ్యాన్స్?

by Anjali |
Namrata-Mahesh Babu: సూపర్‌స్టార్‌ను అమ్మకానికి పెట్టిన నమ్రత.. మండిపడుతోన్న ఫ్యాన్స్?
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి రికార్డు బద్దలు కొట్టాడు. 50 ఏళ్లు దగ్గరగా వస్తోన్న యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తూ ఇప్పటికీ అదే ఎనర్జీతో దూసుకుపోతున్నారు. ఇటీవల తెరకెక్కిన ‘గుంటూరు కారం’ పెద్దగా హిట్ కాకపోయినా బాబు యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇదంతా పక్కన పెడితే.. మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ వంశీ చిత్రంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి పెళ్లై ఇన్నేళ్లు గడుస్తోన్న ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి జీవిస్తూ.. ఆదర్శదంపతులుగా పేరు సంపాదించుకున్నారు.

ఇకపోతే నమ్రత గురించి నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే నమ్రత.. ప్రిన్స్‌ను చీరల షాప్ ఓపెనింగ్‌కు తీసుకెళ్తోందని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్‌తో 50 వరకు ఎండార్స్‌మెంట్స్ చేయించిందట. యాడ్స్ కూడా నమ్రతనే చేయిస్తుందంటుని, రాజమౌళి, మహేష్ బాబు భారీ ప్రాజెక్టుకు గ్యాప్ వస్తుందని నమ్రతను ఏకంగా సూపర్ స్టార్‌ను అమ్మకానికి పెట్టిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story