త్రివిక్రమ్‌పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్.. తమ హీరోను పట్టించుకోవట్లేదంటూ

by Anjali |   ( Updated:2023-07-04 09:21:33.0  )
త్రివిక్రమ్‌పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్.. తమ హీరోను పట్టించుకోవట్లేదంటూ
X

దిశ, సినిమా: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ మొదలైనప్పటినుంచి ప్రతిపని నెమ్మదిగా సాగుతుంది. ఇప్పటివరకు కనీసం 50 శాతం కూడా షూటింగ్ పూర్తికాలేదు. ఇంతలోనే అల్లు అర్జున్‌తో ఒక భారీ పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. దీంతో మహేష్ అభిమానులు త్రివిక్రమ్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ నుంచి పూజా హెగ్డే‌ను తప్పించి శ్రీ లీలకు ప్రమోషన్ ఇచ్చారు. ఇక సెకండ్ హీరోయిన్ ఎవరు అనే విషయంపై క్లారిటీ లేదు. సంగీత దర్శకుడు తమన్ కొనసాగుతాడా లేదా అనేది తెలియదు. అసలు మహేష్ సినిమాపై దర్శకుడు శ్రద్ధ పెట్టడం లేదంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read More..

ఇన్‌స్టాలోకి పవన్ కల్యాణ్ ఎంట్రీ.. క్రియేట్ చేసిన గంటల వ్యవధిలోనే ఎంత మంది ఫాలోవర్సో తెలుసా?

Advertisement

Next Story