Keerthi Suresh: బాలీవుడ్ ఎంట్రీతో భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన మహానటి..! ఎన్ని కోట్లంటే..?

by Kavitha |
Keerthi Suresh: బాలీవుడ్ ఎంట్రీతో భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన మహానటి..! ఎన్ని కోట్లంటే..?
X

దిశ, సినిమా: ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే తెలుగు ఆడియన్స్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటీలో నటిస్తూ మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక ‘మహానటి’, ‘దసరా’ వంటి చిత్రాలకు అయితే ఏకంగా అవార్డులు కూడా వచ్చాయి. ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌తో 15 ఏళ్లుగా రిలేషన్‌లో ఉంటూ డిసెంబర్ 12న గోవాలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లు దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కీర్తి.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది. ‘బేబీ జాన్’ అనే సినిమాతో నార్త్ ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. ఇక ఇప్పటి వరకు కీర్తి నటించిన సినిమాలు పెద్దగా హిందీలో రిలీజ్ కాలేదు. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ చిత్రం కోసం కీర్తి భారీగానే డిమాండ్ చేస్తుందట. ‘బేబీ జాన్’ సినిమాకు కీర్తి సురేష్ ఏకంగా రూ. 4కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story

Most Viewed