- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్లీన్ వర్జిన్ ఫ్యామిలీ.. మాధురీ దీక్షిత్ కుటుంబం గురించి చెప్తుందేంటి?
దిశ, సినిమా: సీనియర్ నటి మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మజా మా'. పూర్తి ఫ్యామిలీ డ్రామాగా ఆనంద్ తివారీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మధ్యతరగతి మహిళ, ఇద్దరు పిల్లలకు తల్లి పాత్రలో కనిపించిన మాధురి.. వారిని సరైన మార్గంలో పెట్టేందుకు ప్రయత్నిస్తూ 'పరిపూర్ణం'గా ఉండాలని ఆరాటపడుతుంది.
తండ్రి పాత్రలో కనిపించిన గజరాజ్ రావు తన కుటుంబాన్ని ఎల్లప్పుడు 'క్లీన్ వర్జిన్ ఫ్యామిలీ'గానే నిరూపించుకోవాలని ఆరాటపడతాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తల్లి వీడియో కారణంగా కొడుకు ఎన్ఆర్ఐ సంబంధం క్యాన్సిల్ కావడం.. తాను కేవలం ఒకరి భార్య లేదా తల్లి మాత్రమే కాదని, తనకంటూ ఓ స్వంత గుర్తింపును కలిగి ఉండాలని కోరుకోవడం.. సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక అమృతపాల్ సింగ్ బింద్రా నిర్మించిన మూవీ అక్టోబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది.