Abhinaya : నటి అభినయ అరెస్ట్‌కు సిద్ధమైన పోలీసులు.. లుక్ అవుట్ నోటీస్..

by Prasanna |
Abhinaya : నటి అభినయ అరెస్ట్‌కు సిద్ధమైన పోలీసులు..  లుక్ అవుట్ నోటీస్..
X

దిశ, సినిమా : సీనియర్ కన్నడ నటి అభినయను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు బెంగళూరు సిటీ పోలీసులు. తన సోదరుడి భార్య లక్ష్మీదేవి.. భర్త, అత్తతోపాటుగా వదిన అభినయపై కూడా డొమెస్టిక్ వాయిలెన్స్ కేసు పెట్టింది. వరకట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై విచారించిన సెషన్స్ కోర్టు ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో నిందితులు హైకోర్టుకు అప్పీల్ చేసినా లాభం లేకుండా పోయింది. కాగా ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా.. పరారైనట్లు తెలుస్తోంది. దీనిపై ప్రకటన ఇచ్చిన పోలీసులు.. వీరు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

Advertisement

Next Story