- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎఫ్ఐఆర్‌లో రేవ్ పార్టీకి వెళ్లిన టాలీవుడ్ సెలబ్రెటీల లిస్ట్!..
దిశ, సినిమా: బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు, కన్నడ సినీ-టీవీ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ ఫాంహౌస్ హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డిదిగా పోలీసుల విచారణలో తేలింది. ఈ పార్టీకి రెండు పరిశ్రమలకు చెందిన నటీనటులు, పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు.. అది కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారే వీరిలో అత్యధికంగా ఉన్నారని తెలిపారు పోలీసులు.
అయితే టాలీవుడ్‌కు చెందిన హీరో శ్రీకాంత్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేర్లు ఈ కేసులో వినిపించడంతో కలకలం రేపింది. ఆ వెంటనే వీరు సోషల్ మీడియా ద్వారా స్పందించి తాము ఆ రేవ్ పార్టీకి వెళ్లలేదని , మేం అలాంటి వాళ్లం కాదని వీడియో బైట్‌లు వదిలారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరిట ఇష్యూ అయిన పాస్ అతికించిన కారు లభ్యమవ్వగా బెంగళూరు పోలీసులు, నార్కోటిక్స్ విభాగం ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. కానీ సినీ నటి హేమ తాను పార్టీకి వెళ్లలేదన్న వార్తలను బెంగళూరు పోలీసులు ఖండించి ఆమె పోలీసుల అదుపులోనే ఉందని.. అందరినీ తప్పుదోవ పట్టించడానికే హేమ ప్రయత్నించిందని పోలీసులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా క్రికెట్ బుక్కీగా వ్యవహరిస్తున్న వాసు అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకలకు వీరంతా హాజరైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఫాంహౌస్‌లపై పోలీసుల నిఘా ఉండటంతో వీరు బెంగళూరులో పార్టీ చేసుకోవాలని నిర్ణయించారు. తొలిరోజు 140 మంది, రెండో రోజు 105 మంది ఈ పార్టీకి హాజరైనట్లుగా పోలీసులు తెలిపారు. నటి హేమకు క్లోజ్ ఫ్రెండ్ అయిన చిరంజీవి , అరుణ్, శివాని జైస్వాల్, సందీప్ కొర్రపాటి, రిషి చౌదరి, డింపుల్ చౌదరి, వెంకట్ చౌదరి, బుల్లితెర నటి అషీరాయ్ ఈ రేవ్ పార్టీకి హాజరైనట్లుగా పోలీసులు తెలిపారు. అయితే రేవ్ పార్టీలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారనేది తెలుసుకోవడానికి పోలీసులు మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు.