నేను అందరిలాంటి మనిషిని కాదు.. అలా ఉండలేను

by sudharani |   ( Updated:2023-04-27 15:38:43.0  )
నేను అందరిలాంటి మనిషిని కాదు.. అలా ఉండలేను
X

దిశ, సినిమా : ప్రముఖ కెనెడియన్ యాక్ట్రెస్ లిసా రే.. అనుకోకుండా నటిని అయ్యానంటోంది. ఇటీవల యాక్టింగ్ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించిన బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంది. ఈ మేరకు అందరిలాగే తాను కష్టాలుపడి నటన రంగంలోకి వచ్చానని ప్రజలు భావిస్తున్నారన్న బ్యూటీ.. నిజానికి తాను యాక్సిడెంటల్‌గానే నటిని అయిన విషయం ఎవరికీ తెలియదని చెప్పింది. ‘అందరిలా నేను పూర్తి‌స్థాయి సినిమాల్లో ఉండే మనిషిని కాదు. నాకు చాలా అభిరుచులు ఉన్నాయి. 16 ఏళ్ల నుంచి నటిస్తూనే ఉన్నాను. ఇక యాక్టింగ్ నుంచి రెస్ట్ తీసుకునే సమయం వచ్చిందని గమనించాను. అందుకే విరామం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను’ అంటూ పలు విషయాలు వెల్లడించింది.

Also Read..

నేను వాళ్లలా ఆలోచించను: పంజాబీలపై షెహనాజ్ సెటైర్

Advertisement

Next Story