మెగా ఫ్యామిలీకి విరుద్ధంగా లావణ్య నిర్ణయం.. షాక్‌లో నాగబాబు..!

by sudharani |   ( Updated:2023-06-14 14:54:16.0  )
మెగా ఫ్యామిలీకి విరుద్ధంగా లావణ్య నిర్ణయం.. షాక్‌లో నాగబాబు..!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నాగబాబు నివాసమైన మణికొండ ఫామ్ బీడ్ గేటెడ్ కమ్యూనిటీలో జూన్-9 న వరుణ్, లావణ్యల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక త్వరలో వివాహబంధంతో ఒక్కటి కాబోతున్న ఈ జంటపై అనేక వార్తలు వస్తున్నాయి. వరుణ్, లావణ్యకు సినిమాలు చేయకూడదని కండిషన్‌లు పెట్టినట్లు టాక్. అలాగే లావణ్య త్రిపాఠి కూడా వరుణ్‌కి ఓ కండీషన్‌ పెట్టిందట. తనకిష్టమైన క్లాసికల్‌ డాన్సు ప్రదర్శనలు ఇచ్చేందుకు అభ్యంతరం చెప్పొద్దని, అలాగే సినిమా ప్రొడక్షన్‌లో తాను కొనసాగుతాననే కండీషన్‌ పెట్టినట్టు సమాచారం. ఈ ఒప్పందంపై వీరిద్దరూ ఒక్కటైనట్లు వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలు ఏవీ నిజం కాదు.. అవన్నీ ఉత్త మాటలే అంటూ మరో వార్త వైరల్ అవుతోంది.

అదేంటంటే.. తాజాగా లావణ్య త్రిపాఠి ఒకేసారి మూడు ప్రాజెక్ట్‌లను ఒప్పుకుందట. మెగా కోడలు చేయబోతున్న మూడు సినిమాల వివరాలను ప్రకటించింది పీఆర్‌ టీమ్‌. ఇందులో తమిళంలో అథర్వతో ఓ సినిమా చేస్తుంది. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా చేస్తుందట. దీంతోపాటు అన్నపూర్ణ స్టూడియోస్‌, హాట్‌ స్టార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ఓ వెబ్‌ సిరీస్‌లోనూ లావణ్య నటిస్తుందట. ఈ మూడు ప్రాజెక్టులు లావణ్య కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వార్తలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యామిలీ పెట్టిన కండిషన్లు ఉత్త మాటలే అని కొందరూ అంటుంటే.. లావణ్య మెగా ఫ్యామిలీ కండిషన్స్‌ను పట్టించుకోవడంలేదా అంటూ మరుకొందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ప్రాజెక్టులపై పూర్తి క్లారిటీ రావాలంటే మెగా ఫ్యామిలీ కొత్త కోడలు స్పందించేవరకు వేచి చూడాల్సిందే.

Also Read: హీరో అవ్వడం కోసం అక్కడ సర్జరీ చేయించుకున్న నందమూరి వారసుడు

Advertisement

Next Story