ఆ Web Series కు నో చెప్పిన Lavanya Tripathi.. షాక్‌లో దర్శక నిర్మాతలు!

by Anjali |   ( Updated:2023-09-12 14:47:04.0  )
ఆ Web Series కు నో చెప్పిన Lavanya Tripathi.. షాక్‌లో దర్శక నిర్మాతలు!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లొట్టచెంపల క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో మెగా కోడలు కాబోతుంది. ఈ అమ్మడు మెగా ఫ్యామిలీ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మెగా కుటుంబంలోకి అడుగు పెట్టడం అంటే చిన్న విషయం కాదు. కోట్ల ఆస్తికి అధిపతి అయినా ఉపాసన ఫ్యామిలీకి తగ్గట్లు ఎలా నడుచుకుంటుందో చూస్తూనే ఉన్నాం. ఇక లావణ్య కూడా ఈ తరహాలోనే మెగా ఫ్యామిలీకి ఎలాంటి మచ్చ తీసుకురావొద్దని చాలా జాగ్రత్తపడుతుంది. కాగా లావణ్య కొన్ని నెలల క్రితం.. విశ్వక్ ఖండేరావ్ అనే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్ చేస్తానని మాట ఇచ్చిందట. ప్రస్తుతం డైరెక్టర్ తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట. కానీ ఇందులో హీరోయిన్ పాత్ర బోల్డ్‌గా ఉండటంతో ఈ ముద్దుగుమ్మ దర్శక, నిర్మాతలకు మరోక హీరోయిన్‌ను చూసుకోమని చెప్పిందట. ఈ విషయం విన్న మెగా ఫ్యాన్స్ తెగ ముచ్చటపడిపోతున్నారు. లావణ్య త్రిపాఠిని పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.

ఇవి కూడా చదవండి : ఇది సోషల్ మీడియా కాదు.. అమ్మాయిల సెక్స్ మీడియా: నటి బోల్డ్‌ షోపై వల్గర్ కామెంట్స్

Advertisement

Next Story