- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కల్కి 2898 ఏడీ’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు భారీ ఊరట!
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ హైప్ పెంచాయి. అయితే ఈ ఏడాది మే 9 వ తారీకున ఈ మూవీ థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. కానీ ఎలక్షన్స్ కారణంగా వాయిదా పడనుందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు. ఈ క్రమంలో అభిమానులకు ఊరట కలిగేలా.. ఓ భారీ గుడ్ న్యూస్ లీక్ అయింది. ఈ వారంతో ప్రభాస్ తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకోనున్నారట. ఇటలీలో ఓ స్పెషల్ సాంగ్ చేసి సిటీకీ వచ్చిన ప్రభాస్ తో చిన్న చిన్న ప్యాచ్ వర్క్‌లు అన్నీ కంప్లీట్ చేయబోతున్నారని సమాచారం. ఈ పనులు పూర్తైతే షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వనున్నట్లేనని సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.