ఓటీటీలోకి రాబోతున్న లేటెస్ట్ తెలుగు మూవీ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’

by Prasanna |
ఓటీటీలోకి రాబోతున్న లేటెస్ట్ తెలుగు మూవీ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’
X

దిశ,సినిమా: నటుడు అజయ్ ఘోష్, తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి కలిసి నటించిన మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ హైప్ ను క్రియోట్ చేసాయి. ప్రమోషన్స్ కూడా కొంత వరకు హెల్ప్ చేసాయి. అజయ్ ఘోష్ ప్రత్యేకంగా కొన్ని ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు.

జూన్ 14న థియేటర్లలో రిలీజ్ అయిన “ మ్యూజిక్‌ షాప్ మూర్తి ” మూవీ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇక కలెక్షన్ల విషయానికొస్తే అనుకున్న మేరకు బాగానే వసూలు చేసింది. నెల రోజుల తర్వాత ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ డిజిటల్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా విడుదల తేదీని కూడా ప్రకటించారు. జూలై 16న మ్యూజిక్ షాప్ మూర్తి ప్రసారమవుతుందని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

శివ పాలడుగు దర్శకత్వం వహించిన మూర్తి మ్యూజిక్ స్టోర్‌లో అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి నటీ నటులు నటించారు. ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ సంగీతాన్ని అందించారు.

Advertisement

Next Story

Most Viewed